
గమ్మత్తై గినియన్ కాక్
దీని పూర్తి పేరు గినియన్ కాక్ ఆఫ్ ది రాక్. ప్రధానంగా వర్షారణ్యాల్లో కనిపిస్తుంది.
దీని పూర్తి పేరు గినియన్ కాక్ ఆఫ్ ది రాక్. ప్రధానంగా వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ఈ పక్షి కి సంబంధించిన విశేషం ఏమిటంటే.. వీటిలో మగ పక్షులు ఒక రంగులో, ఆడపక్షులు మరో రంగులో ఉంటాయి. మగపక్షులు ఒత్తై ఆరెంజ్ రంగులో ఉంటే, ఆడపక్షులు పాలిపోయిన గోధుమరంగులో ఉంటాయి. ప్రధానంగా అడవుల్లో దొరికే పళ్లను ఆహారంగా తీసుకొంటాయివి. వర్షారణ్యాల్లో దొరికే దాదాపు 65 రకాల పళ్లజాతులను ఇవి రుచిచూస్తాయి. కీటకాలు, పురుగులను కూడా వదలవు. ఒకే సీజన్‌లో గుడ్లు పెట్టడం వీటిలోని మరో చిత్రమైన లక్షణం.
సాధారణంగా ఇవి జనవరి నెలలో గుడ్లకు వస్తాయి. ఆడ పిట్ట పొదిగి మార్చి కల్లా పిల్లలకు జన్మనిస్తుంది. గుడ్లకు వచ్చే ముందే ప్రత్యేకంగా గూళ్లను కట్టుకొంటాయి. వీటిలో ఒకే భాగస్వామితో జతకట్టే స్వభావం ఉంటుంది. జంటగా మారిన పక్షులు ఒకే గూటిలో ఒదిగిపోవడం జరుగుతుంది. మగపక్షుల్లో ఆడపక్షులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసే లక్షణాలుంటాయి.