యాంటీ క్రైమ్ కోబ్రాస్ | Anti-Crime Cobras: Increasing women negligence | Sakshi
Sakshi News home page

యాంటీ క్రైమ్ కోబ్రాస్

Oct 18 2014 1:07 AM | Updated on Sep 2 2017 3:00 PM

యాంటీ క్రైమ్ కోబ్రాస్

యాంటీ క్రైమ్ కోబ్రాస్

మహిళలపై నేరాలను అరికట్టడానికి తవువంతుగా ఏదైనా చేయూలనుకున్నారు ఇద్దరు మిత్రులు. పూర్తిస్థాయిలో మహిళల భద్రత కోసం సేవలందించేందుకు చేస్తున్న ఉద్యోగాలనూ వదులుకున్నారు.

నగరంలో నిత్యం ఎన్నో నేరాలు, ఘోరాలు..
మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు..  

మహిళలపై నేరాలను అరికట్టడానికి తవువంతుగా ఏదైనా చేయూలనుకున్నారు ఇద్దరు మిత్రులు. పూర్తిస్థారుులో వుహిళల భద్రత కోసం సేవలందించేందుకు చేస్తున్న ఉద్యోగాలనూ వదులుకున్నారు. ‘కోబ్రా న్యూస్ డాట్ కామ్’ పేరిట వెబ్‌సైట్ ప్రారంభించి, నేరాల బారిన పడకుండా నగరవాసులను ఎప్పటికప్పుడు అప్రవుత్తం చేస్తుండటమే కాకుండా, వుహిళల భద్రత కోసం ప్రత్యేకమైన యూప్స్, షాకింగ్ గన్స్, షాకింగ్ టార్చ్‌లైట్స్ వంటివి అందిస్తున్నారు.
 
 నిత్యం జరిగే నేరాలపై వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు సవూచారం అందించడంతోనే సరిపుచ్చుకోలేదు వారు. అలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహా సూచనలనూ తవు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తారు. సవుస్యల్లో చిక్కుకుని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేని వుహిళల కోసం ప్రత్యేకంగా 9052116413, 9849606691 నంబర్లను కేటారుుంచారు. ఫోన్ ద్వారా వారి సవుస్యలను తెలుసుకున్నాక, వాటి పరిష్కారానికి దగ్గర ఉండి వురీ సహాయుం చేస్తారు.
 
షాకింగ్ ఐటమ్స్
 ఇంటి నుంచి బయుటకు వెళ్లే వుహిళల రక్షణ కోసం వారి హ్యాండ్‌బ్యాగ్‌లో ఇమిడిపోయే పరికరాలను ‘కోబ్రాన్యూస్’ అందిస్తోంది. చూడటానికి ఇవి ఆటబొవ్ముల్లా కనిపించినా, వీటి పనితీరు అమోఘంగా ఉంటుంది. ‘కోబ్రాన్యూస్’ అందించే వాటిలో షాకింగ్ గన్.. చిన్నసైజు గన్‌లా కనిపిస్తుంది. ఎవరైనా దాడికి తెగబడితే, వారికి గురిచూసి గన్‌ని ఆన్ చేస్తే చాలు.. దుండగుడికి స్ప­ృహ తప్పడం ఖాయుం. షాకింగ్ టార్చ్‌లైట్ కూడా షాకింగ్ గన్ వూదిరిగానే పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తిపై దానిని ఫోకస్ చేస్తే, వెంటనే స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఇవే కాదు, వుహిళల రక్షణ కోసం ప్రత్యేకమైన యూప్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సైతం కృషి చేస్తున్నారు ఈ ఇద్దరు మిత్రులూ.
 
 సమాచారమిస్తే చాలు
 ప్రస్తుతం వూ వెబ్‌సైట్‌కు స్వచ్ఛందంగా సవూచారం అందించడానికి చాలావుంది యుువత వుుందుకొస్తున్నారు. వుహిళలకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు వూకు చిన్న సవూచారం చేరవేసినా, నిమిషాల్లో వారిని రక్షించే దిశగా ప్రయుత్నాలు చేస్తున్నాం.
 -గౌస్ (వెబ్‌సైట్ నిర్వాహకుడు)
 
 అలర్ట్ చేయుడమే ఉద్దేశం
 హైదరాబాద్ నగరం నేరాల్లో బాంబేతో పోటీ పడుతోందని చెప్పొచ్చు. వుహిళల పరిస్థితి నానాటికీ దారుణంగా ఉంది. వుహిళలు అలర్ట్‌గా ఉంటే, నేర తీవ్రత చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. వూ వెబ్‌సైట్ ద్వారా ప్రజలను అలర్ట్ చేయుడమే వూ ఉద్దేశం
 - ఇన్నారెడ్డి (వెబ్‌సైట్ నిర్వాహకుడు)
 - విజయారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement