టేస్ట్‌బడ్స్‌ కంటే  లాలాజలం ప్రభావమే ఎక్కువ... 

saliva effect is more than taste buds - Sakshi

ఇది అసలు సంగతి

ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే మన రుచిమొగ్గల (టేస్ట్‌బడ్స్‌)తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. రుచి తెలిపేవి రుచిమొగ్గలే అయినప్పటికీ నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. అది ఎలాగంటే... మనం తిన్న పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే  రుచిమొగ్గలు (టేస్ట్‌బడ్స్‌) వాటిని గ్రహించగలుగుతాయి. అందుకే మనం నమలడం మొదలుపెట్టిన కొద్దిసేపటి తర్వాత రుచి ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంటుంది. అన్నట్టు... మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్‌ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. 
వామిటింగ్‌కు దోహదపడే లాలాజలం! 

వాంతి కావడం (వామిటింగ్‌) అనే ప్రక్రియకు లాలాజలం దోహదపడుతుంది. అసలు వాంతి ఎలా జరుగుతుందో, దానికి లాలాజలం ఎందుకు దోహదపడుతుందో చూద్దాం. వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు లాలాజలం చాలా  ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో పొట్ట భాగంలో అది సరిగా జరగనప్పుడు వాంతి (వామిటింగ్‌) అనే చర్య ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top