సీతమ్మవారి పెళ్లి

Ramayan Actress Deepika Chikhalia Tells Her Marriage Secret - Sakshi

.‘రామాయణ్‌’ (1987) టీవీ సీరియల్‌లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. టీవీ రామాయణంలోని సీతమ్మ.. దీపికా చికాలియా మొదటిసారి అతడిని 1983 నాటి తన తొలిచిత్రం ‘సున్‌ మేరీ లైలా’ షూటింగ్‌ లో చూశారు. మళ్లీ 1991 ఏప్రిల్‌ 28న అతడిని చూశారు. ఆరోజు అతడి పక్కన ఇద్దరికీ తెలిసిన వాళ్లెవరో ఉన్నారు. ఆ ఎవరో వెళ్లిపోయాక వీళ్లిద్దరే ఉన్నారు. రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు. తర్వాత రెండు గంటలు మాట్లాడుకున్నారు! ఏం మాట్లాడుకున్నారో దీపికా చికాలియా చెప్పడం లేదు కానీ, పెళ్లి చేసుకుందామని ఆ రెండు గంటల్లోనే ఇద్దరూ డిసైడ్‌ అయిపోయారట. లాక్‌డౌన్‌ తీరిక ఇంటర్వ్యూలో ఈ సంగతి బయట పెట్టారు చికాలియా. ఆమె భర్త హేమంత్‌ టోపీవాలానే ఆనాటి ’అతడు’.. (సరోజినీ నాయుడుగా..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top