
వైఎస్సార్‌సీపీలో చేరిన శివరామిరెడ్డి
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి శుక్రవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
హైదరాబాద్: అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి శుక్రవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఉరవకొండ నియోజక వర్గానికి చెందిన ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. మరోవైపు కదిరి నియోజకవర్గానికి చెందిన జిల్లా మద్యనియంత్రణ కమిటీ చైర్మన్ చింతల రాజశేఖర్‌తోపాటు ఏవై తిప్పారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.