కుప్పకూలిన ఉపాధి కూలీ | man dies of sun stroke | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఉపాధి కూలీ

May 19 2017 11:04 PM | Updated on Sep 5 2017 11:31 AM

కుప్పకూలిన ఉపాధి కూలీ

కుప్పకూలిన ఉపాధి కూలీ

గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామ చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తూ రమేశ్‌(34) అనే కూలీ కుప్పకూలి మరణించాడు.

గుమ్మఘట్ట (రాయదుర్గం) : గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామ చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తూ రమేశ్‌(34) అనే కూలీ కుప్పకూలి మరణించాడు. మృతుని భార్య అంజినమ్మ, తోటి కూలీల కథనం మేరకు.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉన్నపళంగా స్పృహతప్పి పడిపోయాడన్నారు. వెంటనే రాయదుర్గం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ హైదర్‌వలి, తహశీల్దార్‌ అఫ్జల్‌ఖాన్‌, ఎంపీడీఓ మునెప్ప ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement