
రైల్లోంచి జారిపడి 10టీవీ ఉద్యోగి మృతి
ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు.
నల్లగొండ: ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా జనగామ మండలం కళ్లె గ్రామానికి చెందిన ముసిగంపుల శ్రీనివాస్ హైదరాబాద్‌లోని 10 టీవీ కార్యాలయంలో గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం రైల్లో వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య స్వప్నతో పాటు ఏడాది పాప ఉందని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ మృతిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.