ప్రసవించిన విద్యార్థిని మృతి | Man Arrested Under Pocso Act | Sakshi
Sakshi News home page

మృతశిశువును ప్రసవించిన విద్యార్థిని మృతి

Jan 20 2019 9:40 AM | Updated on Jan 20 2019 10:12 AM

Man Arrested Under Pocso Act - Sakshi

తిరువొత్తియూరు: విద్యార్థిని గర్భిణిని చేసి ఆమె మృతికి కారణమైన యువకుడిని పోలీసులు శనివారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా ఊతంకరై పుదూర్‌ భూగునైకి చెందిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. తాత, అవ్వ వద్ద ఉంటున్న విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన తమిళరసన్‌ (27) విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో గర్భిణి అయిన బాలికను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినికి శస్త్ర చికిత్సద్వారా కడుపులో ఉన్న మృతశిశువును తొలగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం విద్యార్థిని మృతి చెందింది. దీనిపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థిని గర్భిణీ చేసి ఆమె మృతికి కారణమైన తమిళరసన్‌ను పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement