చెన్నైలో ‘ఊయల ’ కార్యాలయం | Telstra arm Ooyala opens office in India | Sakshi
Sakshi News home page

చెన్నైలో ‘ఊయల ’ కార్యాలయం

Jun 11 2016 1:13 AM | Updated on Sep 4 2017 2:10 AM

చెన్నైలో ‘ఊయల ’ కార్యాలయం

చెన్నైలో ‘ఊయల ’ కార్యాలయం

ఆస్ట్రేలియా టెలికం ఆపరేటర్ ‘టెల్స్‌ట్రా’కు చెందిన డిజిటల్ వీడియో పబ్లిషింగ్ విభాగం ‘ఊయల’ తాజాగా భారత్‌లో తన తొలి ..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టెలికం ఆపరేటర్ ‘టెల్స్‌ట్రా’కు చెందిన డిజిటల్ వీడియో పబ్లిషింగ్ విభా గం ‘ఊయల’ తాజాగా భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నాటికి ఇందులో 100 మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నామని ఊయల సీఈవో రమేశ్ శ్రీనివాసన్ తెలిపారు. దీంతో తమకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగ సిబ్బంది వాటా 20 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్, టెక్నికల్ సపోర్ట్ వంటి తదితర విభాగాల్లో ఉద్యోగ నియామకాలు ఉంటాయని వివరించారు. ‘ఊయల’ కంపెనీ బ్రాడ్‌కాస్టర్స్, పబ్లిషర్స్, మీడియా సంస్థలకు ఆన్‌లైన్ వీడియోకు సంబంధించిన సేవలను అందిస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement