రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త | Realme Nazro 10 And10A To Launch In India On April 21 | Sakshi
Sakshi News home page

రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త

Apr 17 2020 8:59 PM | Updated on Apr 17 2020 9:12 PM

Realme Nazro 10 And10A To Launch In India On April 21 - Sakshi

ముంబై : రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు ఫోన్లు మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈవెంట్‌ను వాయిదా వేసింది. ఏప్రిల్ 20న లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఉండటంతో రియల్‌మీ ఆన్‌లైన్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 21న రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేయనుంది. రియల్‌మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. వాటితో పాటు నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement