స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు | Petrol, Diesel Prices Drop Again As Crude Oil Prices Recede | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

Oct 25 2018 10:37 AM | Updated on Oct 25 2018 11:43 AM

Petrol, Diesel Prices Drop Again As Crude Oil Prices Recede - Sakshi

పెట్రో భారాల నుంచి స్వల్ప ఉపశమనం

సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌ ధరలు లీటర్‌కు 15 పైసలు తగ్గగా, డీజిల్‌ లీటర్‌కు 5 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నాయి. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76 డాలర్లకు తగ్గాయి.

ఈనెల ఆరంభంలో బ్యారెల్‌ ముడిచమురు ధర 86 డాలర్లకు ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక గురువారం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 85.98 కాగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 81.36 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ 81.10 కాగా, డీజిల్‌ లీటర్‌ రూ74.80గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ 86.58 కాగా, డీజిల్‌ లీటర్‌కు రూ 78.41 పలికింది. ముడిచమురు ధరలు తగ్గడంతో డాలర్‌తో రూపాయి విలువ బలపడింది. అక్టోబర్‌లో డాలర్‌తో రూపాయి మారకం రూ 74 దాటగా ప్రస్తుతం రూ 73.31గా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement