రేపట్నుంచే సూపర్ ఫోన్ అమ్మకాలు | Le 1s Eco 'Superphone' goes on sale for Rs. 9999 on May 12 | Sakshi
Sakshi News home page

రేపట్నుంచే సూపర్ ఫోన్ అమ్మకాలు

May 11 2016 4:47 PM | Updated on Oct 16 2018 2:49 PM

రేపట్నుంచే సూపర్ ఫోన్ అమ్మకాలు - Sakshi

రేపట్నుంచే సూపర్ ఫోన్ అమ్మకాలు

చైనా టెక్నాలజీ కంపెనీ లీ ఇకో 'మేడ్ ఫర్ ఇండియా' స్మార్ట్ ఫోన్ లీ 1ఎస్(ఎకో) మొదటి ఫ్లాస్ అమ్మకాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

చైనా కంపెనీ లీ ఇకో 'మేడ్ ఫర్ ఇండియా' స్మార్ట్ ఫోన్ లీ 1ఎస్(ఎకో) అమ్మకాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సూపర్‌ఫోన్ అని పిలుస్తున్న ఈ ఫోన్‌ను కేవలం ఫ్లిప్ కార్ట్‌లోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్ముతామని కంపెనీ ప్రకటించింది. మొదటి ఫ్లాష్‌ సేల్స్ కింద రూ.9,999కు ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది. అన్నీ హెచ్ డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. లీ ఇకో మెంబర్ షిప్ విలువ రూ.4,900 తో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకం జరగనుంది. లీ ఇకో మెంబర్ షిప్ ద్వారా యూజర్లు 2వేల మూవీలు,100 లైవ్ టీవీ ఛానెల్స్, 3.5 మిలియన్ కంటే ఎక్కువ పాటలను ఓటీఏ సాప్ట్ వేర్ అప్ డేట్ ద్వారా యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
 

లీ 1ఎస్(ఎకో) ఫీచర్స్ :
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే (1920x1080 పిక్సెల్) రిజల్యూషన్
మీడియా టెక్ హెలియో ఎక్స్ 10 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నెల్ మెమెరీ
13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్
డ్యూయల్ సిమ్(మైక్రో,నానో సిమ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement