ఎంఎస్‌ఆర్ ఆదాయం జూమ్ | Chase closes massive $45B Fannie Mae MSR deal from Ocwen | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఆర్ ఆదాయం జూమ్

May 29 2015 2:11 AM | Updated on Jun 4 2019 6:36 PM

ఎంఎస్‌ఆర్ ఆదాయం జూమ్ - Sakshi

ఎంఎస్‌ఆర్ ఆదాయం జూమ్

కన్సూమర్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఎంఎస్‌ఆర్ ఇండియా లిమిటెడ్ 2014-15 ఆర్ధిక సంవత్సరం వార్షికాదాయం 750 శాతం పెరిగింది.

సాక్షి, హైదరాబాద్: కన్సూమర్  ప్రొడక్ట్స్ తయారు చేసే ఎంఎస్‌ఆర్  ఇండియా లిమిటెడ్ 2014-15 ఆర్ధిక సంవత్సరం వార్షికాదాయం 750 శాతం పెరిగింది. ఈ మేరకు  కంపెనీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.85 కోట్ల ఆదాయంపై  రూ.40.93 లక్షల నికర  లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.10.18 కోట్లు కాగా, నికర నష్టం 15.33 లక్షలుందని వివరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రూ. 28.04 కోట్ల ఆదాయం  నమోదు కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం రూ.7.65 కోట్లు ఆదాయం నమోదైందన్నారు. దీంతో  పోలిస్తే  ఆదాయం 266 శాతం పెరిగినట్లయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement