గుడ్‌న్యూస్‌: దిగి వస్తున్న పెట్రో ధరలు | Another fall in fuel prices | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: దిగి వస్తున్న పెట్రో ధరలు

Oct 29 2018 8:08 AM | Updated on Oct 29 2018 8:19 AM

Another fall in fuel prices - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  ఇటీవల చుక్కలు చూపించిన  ఇంధన ధరలు  క్రమంగా  తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా  12వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గాయి.  ఇటీవల ఆల్‌ టైం గరిష్టాలను తాకిన ఇంధన ధరలు అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో తాజాగా ఆరువారాల కనిష్ఠానికి  దిగి వచ్చాయి. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆ మేరకు ధరలను తగ్గించాయి.

సోమవారం ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర 30 పైసలు తగ్గిన 79.75గా ఉంది. డీజిల్ ధర లీటరుకు 20 నుంచి తగ్గి రూ. 73.85గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరుకు 85.24 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు 77.40 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 21 చొప్పున  ధర తగ్గింది.

హైదరాబాద్‌:  పెట్రోల్‌ లీటరు ధర రూ.84.54, డీజిల్‌ లీటరు ధర రూ.80.33గా ఉంది. 
విజయవాడ: పెట్రోలు ధర రూ.83.65, డీజిల్‌ లీటరు ధర రూ. 79.08 పలుకుతోంది.
కోలకతా:  పెట్రోలు లీటరు ధర రూ.81.63, డీజిల్ లీటరు ధర రూ .75.70
చెన్నై:   పెట్రోలు లీటరు ధర రూ. 82.86, డీజిల్‌ లీటరు ధర రూ. 78.08

అక్టోబర్ 4న రికార్డు స్థాయికి చేరినన పెట్రోల్, డీజిల్ ధరలు గత 12రోజుల్లో  రెండు రూపాయలకు పైగా దిగి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement