నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం | YSR Congress party THE ORIGIN celebration today | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Mar 12 2016 3:57 AM | Updated on May 25 2018 9:20 PM

నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ   ఆవిర్భావ దినోత్సవం - Sakshi

నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా .....

 పార్టీ జిల్లా కార్యాలయంలో 10 గంటలకు జెండావిష్కరణ: బుడ్డా
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. పార్టీ ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా  వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు బిర్లాగడ్డ సమీపంలోని కృష్ణజ్యోత్స్న కాంప్లెక్స్‌లో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య పతాకావిష్కరణ, కేక్ కటింగ్ ఉంటుందన్నారు.  ఆ తర్వాత కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

 సాయంత్రం కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు  ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బీఏఎస్ కల్యాణ మండపంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement