108 రాక నరకయాతన..

Tdp Governament Neglects The 108 Service - Sakshi

సాక్షి, గొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదం ... స్థానికుల సాయంతో నుజ్జునుజ్జయిన కారులోంచి గాయపడిన ఆ దంపతులను బయటకు తీస్తూనే 108కు ఫోన్లు చేశారు. రహదారి పక్కనే రక్తమోడుతున్న ఇద్దరికీ సపర్యలు చేస్తూనే 108 రాకకోసం ఎదురుచూపులు చూశారు. గంటన్నర సేపు చూసినా ఫలితం లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రాణంపోతున్నా స్పందించని తీరును చూసిన అక్కడున్న వారు ‘రాజన్న ఉండి ఉంటే ఇలా జరిగేదా’ అని తలచుకుంటూ నేటి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి...గొల్లప్రోలు వై జంక్షన్‌ వద్ద విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్న కారును గొల్లప్రోలు పట్టణం నుంచి సబ్‌ వే మీదుగా 216 జాతీయ రహదారిపైకి ప్రవేశిస్తున్న వ్యాన్‌ ఆదివారం మధ్యాహ్నం ఢీ కొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన భార్యాభర్తలు ఎంఎస్‌ మూర్తి, నాగలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. సబ్‌వేకు ఓ వైపు స్పీడు బ్రేకర్లుండడంతో రెండు వైపులా వచ్చే వాహనాలు ఓ వైపు నుంచి వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్‌ హైవేపై వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టి, రోడ్డు మధ్యకు ఈడ్చుకుపోయింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కారు నుంచి బయటకు తీస్తూనే 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. క్షతగాత్రులను తీసి రోడ్డుపక్కన పడుకోపెట్టి 108 అంబులెన్స్‌ కోసం గంటన్నరపాటు ఎదురు చూశారు. గాయపడిన బాధితులు రక్తపు మడుగులోనే ఆర్తనాదాలు చేసుకుంటూ నరకయాతనపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికులు గాయపడిన భార్యా భర్తలను ప్రైవేటు వాహనంపై కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడంతో క్షతగాత్రులు పడిన బాధను చూసి ‘ఆ రాజన్నే ఉండి ఉంటే ఇలా ఉండేదా’అని ఘటనాస్థలంలో ఉండేవారు అనుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top