ఆంధ్రప్రదేశ్
ఆవిర్భావ దినం నవంబర్‌ 1, 1956
జిల్లాలు 26
ప్రాంతం 162970 చ. కి.మీ
ప్రాంతం పరంగా దేశంలో 7వది
అసెంబ్లీ స్థానాలు 175
లోక్ సభ స్థానాలు 25
రాజ్యసభ స్థానాలు 11
మండలి స్థానాలు 58
రిజిస్టర్డ్ పార్టీలు (ఈసీ నివేదిక) 112 (జనవరి 30, 2024)
రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు 2
రెవెన్యూ డివిజన్స్
కార్పొరేషన్స్ 17
మున్సిపాలిటీలు 79
నగర పంచాయతీలు 30
రెవెన్యూ మండలాలు 680
రెవెన్యూ గ్రామాలు 27800
జనాభా 4.95 కోట్లు
జనాభా పరంగా దేశంలో 10వ స్థానం
పట్టణ జనాభా 1.46 కోట్లు (29.5%)
గ్రామీణ జనాభా 3.49 కోట్లు (70.5%)
అక్షరాస్యత 67.02%
మొత్తం ఓటర్లు (ఈసీ) 4.08 కోట్లు
పురుషులు 2.01 కోట్లు
మహిళలు 2.07 కోట్లు
ఇతరులు 3482
రాష్ట్ర పక్షిరామచిలక
రాష్ట్ర జంతువుకృష్ణజింక
రాష్ట్ర చెట్టువేప చెట్టు
రాష్ట్ర పువ్వుమల్లె
పెద్ద జిల్లా (భౌగోళికంగా)ప్రకాశం
చిన్న జిల్లా (భౌగోళికంగా)విశాఖపట్నం
పెద్ద జిల్లా (జనాభా)పొట్టి శ్రీరాములు నెల్లూరు
చిన్న జిల్లా (జనాభా)పార్వతీపురం మన్యం జిల్లా
రాష్ట్ర సరిహద్దులుకర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ గఢ్
రాష్ట్ర ముఖచిత్రం

తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ఎంతో ఘనచరిత్ర కలిగిన రాష్ట్రం. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ పేరిట ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డాయి. తెలంగాణ విడిపోవడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన భాష తెలుగు కాగా.. ఉర్దూ రెండో స్థానంలో ఉంది. 


రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదో అతి పెద్ద రాష్ట్రమైన ఏపీలో ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా. 1953 అక్టోబర్‌ ఒకటిన మద్రాస్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న ఆంధ్ర, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. దీంతో 1956, నవంబర్‌ ఒకటిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, మద్రాస్ నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రం కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. 


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత పునర్విభజింపబడి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి మనుగడలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి.అపారమైన వనరులు, సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంతోపాటు వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, దాక్షరామం, అన్నవరం, బెజవాడ కనకదుర్గమ్మ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అరుకు లోయ, హార్స్‌లీ హిల్స్‌ వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.