అపవిత్ర కలయికను తిరస్కరించారు | Sakshi
Sakshi News home page

అపవిత్ర కలయికను తిరస్కరించారు

Published Wed, Dec 12 2018 1:05 PM

kakani Govardhan Fired on Chandrababu Naidu - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): తెలంగాణాలో వెలువడిన ఎన్నికల  ఫలితాలు  సీఎం చంద్రబాబుకు చెంపపెట్టులాగా ఉన్నాయని,అపవిత్ర కలయికను  ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలంలోని మండపం గ్రామ పంచాయతీకి  సంబంధించి టీడీపీ నుంచి కార్యకర్తలు, వార్డు సభ్యులు సుమారు 100 కుటుంబాలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాబోవు ఎన్నికల్లో టీడీపీ కనీస స్థానాలు కూడా గెలుచుకోలేదన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన చంద్రగ్రహణం వీడనుందన్నారు. దివంగత ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడచిన చంద్రబాబు, ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులను తన స్వార్థం కోసం చంద్రబాబు పావులుగా వాడుకుంటూ తీరని ద్రోహం చేశారని వాపోయారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి హరికృష్ణ కుమార్తె ఎన్నికల్లో పోటీ చేసి మోసపోయిందన్నారు. కొడుకు లోకేష్‌కు మాత్రం మంత్రిపదవి ఇచ్చిన చంద్రబాబు, ఎన్‌టీఆర్‌ కుటుంబంలోకి వారికి మాత్రం ఓటమి పాలయ్యే స్థానాల్లో నిలబెట్టి పథకం ప్రకారం ఎన్‌టీఆర్‌ పరువును దిగజార్చుతున్నారన్నారు. రూ.500 కోట్లు  ఖర్చు పెట్టి, కాంగ్రెస్‌తో జతకట్టి ఉద్ధృతంగా ప్రచారం చేసినా ఏ మాత్రం చంద్రబాబు ప్రభావం చూపలేదన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోలేక తప్పలేదన్నారు.

సర్వేపలి నియోజకవర్గంలో ఊపందుకున్న వలసలు
సర్వేపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోఅధికార పార్టీ పెత్తనం సాగిస్తున్న వారు ఎంతటి వారైనా వారి అవినీతిని అడ్డుకుంటామే తప్ప, విడిచిపెట్టేది లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుందన్నారు. ఉప్పాల వెంకయ్య, కుప్పా సురేష్, బొచ్చు పుల్లయ్య, తాండ్ర మోహన్, బొచ్చు సురేష్, తాండ్ర లక్ష్మీ, కాంతమ్మ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement