మీ కోసం సీఎంతో చర్చిస్తా : ఆళ్ల నాని | Felicitation To Alla Nani In West Godavari | Sakshi
Sakshi News home page

మీ కోసం సీఎంతో చర్చిస్తా : ఆళ్ల నాని

Aug 18 2019 1:50 PM | Updated on Aug 18 2019 1:56 PM

Felicitation To Alla Nani In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: శ్రీ శయన కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఆదివారం ఘన సన్మానం చేశారు. జిల్లాలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. శ్రీశయన కుల సంఘానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని భరోసానిచ్చారు. శ్రీశయన కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో చర్చిస్తానన్నారు. అదే విధంగా శ్రీశయన కమ్యూనిటీ హాలుకు ప్రత్యేక స్థలం కేటాయింపుతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అర్హులైన పేద శ్రీశయనులకు ఇళ్ల స్థలాలను, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement