చిన్నారిపై మృగాడి అఘాయిత్యం! | dadapeer sexual harassment on child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై మృగాడి అఘాయిత్యం!

Sep 12 2014 2:41 AM | Updated on Jul 28 2018 8:51 PM

పెళ్లీడుకొచ్చిన కూతురున్న ఓ మృగాడు మానవత్వాన్ని, పెద్దరికాన్ని మంటగలిపి అభంశుభం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిని బలాత్కారం చేయబోయాడు.

నీలం సంజీవరెడ్డి కాలనీలో ఘటన

అనంతపురం క్రైం : పెళ్లీడుకొచ్చిన కూతురున్న ఓ మృగాడు మానవత్వాన్ని, పెద్దరికాన్ని మంటగలిపి  అభంశుభం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిని బలాత్కారం చేయబోయాడు. ఈ అమానవీయ ఘటన బుధవారం అనంతపురం రూరల్ నీలం సంజీవరెడ్డి(ఎన్‌ఆర్) కాలనీలో చోటుచేసుకుంది. గురువారం ఇది వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన దాదాపీర్(36) బొప్పాయి వ్యాపారం చేస్తుంటాడు.
 
గత కొంత కాలంగా ఆయన కుటుంబంతో ఎన్‌ఆర్‌కాలనీలో నివసిస్తున్నాడు. ఇదే కాలనీలోని ఓ దంపతుల కుమార్తె(4), అక్కడి అంగన్‌వాడీ బడికి వెళుతోంది. బుధవారం మధ్యాహ్నం బడికెళ్లిన ఆ చిన్నారిని దాదాపీర్ చాక్లెట్లు కొనిస్తానంటూ తన ఇంట్లోకి పిలుచుకున్నాడు. కాసేపు మాటలు చెప్పి చిన్నారిపై అఘాయిత్యం చేయబోయాడు. దీంతో ఆ చిన్నారి ఏడుపు మొదలు పెట్టడంతో భయపడి పంపించేశాడు. ఇంటికెళ్లిన ఆ పాప బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వ్యక్తీకరించలేక పోయింది.
 
గురువారం ఉదయం అంగన్‌వాడీ స్కూలుకు పంపేందుకు తల్లి సిద్ధం చేస్తుండగా వెళ్లనంటూ మారాం చేసింది. ‘నేను పోతే.. ఆ తాత ఇంట్లోకి పిలుచుకెళ్లి...’ అంటూ తడబడుతూ చెప్పడంతో ఆ తల్లి గుండె గుభేలుమంది.  వెంటనే భర్త, బంధువులకు విషయాన్ని చేరవేసింది. వారు దాదాపీర్ వద్దకు వెళ్తే అప్పటికే అతను పారిపోయాడు. తర్వాత వారు అంగన్‌వాడీ టీచరును ఆరా తీశారు. అయినా లాభం లేకపోయింది. తల్లిదండ్రులు, కూతురితో గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ శుభకుమార్‌కు ఫి ర్యాదు చేశారు. సీఐ మహిళా కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించి విచారణ  చేయిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement