
శాసన సభ సమావేశాలు ప్రారంభం
శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే సమైక్య రాష్ట్ర తీర్మానం కోసం వైఎస్ఆర్ సిపి సభ్యులు డిమాండ్ చేశారు. సభలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు.
సంతాప తీర్మానాలకు సహకరించాలని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. తొలుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్కు నివాళులర్పించారు.