జిల్లాలో 27 మద్యం దుకాణాలకు 37 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ ఈఎస్ పి. శ్రీధర్ తెలిపారు. జిల్లాలో 2014-2015 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకు
విజయనగరం రూరల్ : జిల్లాలో 27 మద్యం దుకాణాలకు 37 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ ఈఎస్ పి. శ్రీధర్ తెలిపారు. జిల్లాలో 2014-2015 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ ఈనెల 23న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ తేదీ నుంచి అధికారులు దరఖాస్తు లు ఆహ్వానించగా గత రెండు రోజుల్లో ఒక్క దరఖా స్తు కూడా రాలేదు. బుధవారం మాత్రం విజయనగరం యూనిట్‌లో 21 మద్యం దుకాణాలకు 31 దరఖాస్తులు, పార్వతీపురం యూనిట్‌లో 6 మద్యం దు కాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చారుు. ఇందులో విజయనగరం వన్ సర్కిల్‌లో మూడు దుకాణాలకు 9 దరఖాస్తులు, భోగాపురం సర్కిల్‌లో 4 దుకాణాలకు 5 దరఖాస్తులు, చీపురుపల్లి సర్కిల్‌లో 11 దుకాణాలకు 13, నెల్లిమర్ల సర్కిల్‌లో ఒక దుకాణానికి ఒకటి, గజపతినగరం సర్కిల్‌లో ఒక దుకాణానికి రెండు దరఖాస్తులు, ఎస్. కోటలో ఒక దుకాణానికి ఒక దరఖాస్తు వచ్చిందన్నారు. పార్వతీపురం యూ నిట్ పరిధిలోని కొర్లాంలో మూడు మద్యం దుకాణాలకు మూడు దరఖాస్తులు, సాలూరు సర్కిల్‌లో మూ డింటికి మూడు దరఖాస్తులు వచ్చారుు.ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ సారైనా పూర్తిస్థారుులో దరఖాస్తులు వచ్చేనా..?
జిల్లాలోని మద్యం దుకాణాలకు ఈ సారైనా పూర్తిస్థారుులో దరఖాస్తులు అందుతాయూ అన్న ప్రశ్న తలెత్తుతోంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు పూర్తి కానుంది. అయితే రెండేళ్ల కిందట వర కు మద్యం అమ్మకాల్లో లాభాలు చూసిన వ్యాపారు లు, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు సాగించాలని గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో చాలామంది దరఖాస్తు చేయలేదు. ఒకప్పుడు మద్యం వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి వారు సూచించిన ధరలకే అమ్మకాలు సాగడంతో కో ట్లాది రూపాయల లాభాలు పొందేవారు. కానీ గత ప్రభుత్వం ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు సాగించాలన్న నిబంధన విధించడంతో వ్యాపారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎక్సైజ్ ఉన్నతాధికారు లు మద్యం దుకాణాలు లెసైన్స్ పొందడానికి సీఐల పై ఒత్తిడి తీసుకువచ్చారు.
జిల్లాలోని 13 సర్కిల్ పరిధిలోని సీఐలు గతేడాది మద్యం దుకాణాలు లా టరీలో పొందేలా వ్యాపారులపై ఒత్తిడి చేశారు. అయినా 12 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. అరుుతే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులను నిషేధిస్తూ.. జీవో జారీ చేయడంతో మళ్లీ గత ఏడాది పరిస్థితే పునరావృతమైయ్యే అవకాశాలు ఉన్నారుు. వాస్తవానికి మద్యం వ్యాపారులకు బెల్ట్ షాపుల ద్వారానే అధిక ఆదాయం వస్తోంది.అరుుతే ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేయడంతో ఈ ఏడాది కూడా మద్యం దుకాణాలకు దరఖాస్తులు అంతగా రావడం అనుమానమేనని అధికారులు చెబుతున్నారు. కాగా అన్ని దుకాణాలకు దరఖాస్తు లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఆయా సర్కిల్ పరి ధిలోని సీఐలదేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గత లెసైన్స్‌దారులతో మాట్లాడి దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.