‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు. దీంతో తన ఓటమిని ఆయన ముందే అంగీకరించినట్లు స్పష్టమయ్యింది. మంగళవారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, చంద్రగిరి, పుత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బాబుకు ఎన్నికల భయం పట్టుకుని నోటికొచ్చినట్లు పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.