కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డీ.శ్రీనివాస్ బుధవారం కేసీఆర్తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసే యోచనలో ఉన్నారు.