
సాక్షి, కర్నూలు: వర్షాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేని నేతలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మాట్లాడే హక్కులేదని ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ప్రజలకు సేవ చేస్తే స్వాగతిస్తాం. సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. అంతేగాని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని’’ ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు. (చదవండి: 100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?)
గత ఐదేళ్లలో ప్రజల మీద పడి దోచుకున్నారు కాబట్టే టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేత ఎస్వీ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని, గత ప్రభుత్వ హయాంలో వార్డులో సీసిరోడ్లు వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇళ్లలోకి నీరు చేరి సమస్య వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి)