
సాక్షి,అమరావతి/సాక్షి, పుట్టపర్తి: మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల ఆదివారం విడుదల చేశారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.