
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్–2021 సహా వివిధ సెట్ల షెడ్యూళ్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఆగస్టు 19 నుంచి 25 వరకు జరగనుందన్నారు. ఏపీఈఏపీ సెట్ గతంలో ఏపీ ఎంసెట్‌గా ఉండేది. ఈఏపీ సెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వెల్లడించారు.