
కుక్క దాడిలో ఉపాధి కూలీకి గాయాలు
చీడికాడ: మండలంలోని జె.బి.పురంలో పిచ్చికుక్క దాడిలో ఓ ఉపాధి కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి దేముడమ్మ ఓ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన పిచ్చికుక్క దాడి చేసింది. దేముడమ్మ చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా గాయపరిచింది. పక్కనే ఉన్న తోటి కూలీలు కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు పెదగోగాడ పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు చోడవరం సీహెచ్‌సీ మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు తెలిపారు.