నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్‌! | Left Paralysed By An Accident My Son Needs Brain Surgery Please Help | Sakshi
Sakshi News home page

నా కొడుకు రాహుల్‌ని కాపాడండి... దయగల దాతలు ఆదుకోండి ప్లీజ్‌!

Published Thu, Jul 14 2022 12:32 PM | Last Updated on Tue, Aug 2 2022 11:04 AM

Left Paralysed By An Accident My Son Needs Brain Surgery Please Help - Sakshi

సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో కలిసి రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్‌కాల్‌ పిడుగులా మారింది. రాహుల్‌ బైక్‌ను లారీ ఢీకొట్టిందనీ,  తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల.

రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి   ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్‌ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి  సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్‌కాల్‌ పిడుగులా మారింది. రాహుల్‌ బైక్‌ను లారీ ఢీకొట్టిందనీ,  తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల.

వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్‌ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు  చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ  ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని,  నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది.
మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి



రాహుల్‌ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా  కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్‌ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది.



‘‘రాహుల్‌కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్‌ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు  10-15 రోజుల ఆసుపత్రిలో  ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట.



చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్‌ ఆపరేషన్‌ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్‌ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్‌)
మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్