Salman Agha
-
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025 -
ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమే: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైన పాక్.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్‌తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్‌లో పరాజయం పాలైంది.ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమేఅయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇలాంటి సిరీస్‌లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది.సిరీస్ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్ నవాజ్ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు.వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాంమేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్, ప్రపంచకప్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.అపుడు డకెట్ కూడా ఇలాగేఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా కామెంట్లపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్‌తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్‌లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.రెండు జట్లదీ ఒకే పరిస్థితిఅయితే, చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్ ఆఘా తమ ఫోకస్ ఆసియా కప్, వరల్డ్‌కప్ మాత్రమే అని చెప్పడం గమనార్హం. అన్నట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇంగ్లండ్ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిపాక్తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి
పాకిస్తాన్‌తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్‌లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్‌డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? : పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్‌గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది. 91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమిఅయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? ‘‘అసలు షాదాబ్‌ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.అయినా.. కివీస్‌తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా కివీస్‌తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్‌లు ఉండేవారు.కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: 18వ సారైనా... బెంగళూరు రాత మారేనా! -
తీరు మారని పాకిస్తాన్.. 91 పరుగులకే ఆలౌట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పేలవ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ అగా సల్మాన్(18)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్.. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టీ20 సిరీస్‌కు మాత్రం కీలక ఆటగాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాంలను టీ20 జట్టు నుంచి పాకిస్తాన్ సెలక్టర్లు తప్పించారు. మహ్మద్ రిజ్వాన్ స్ధానంలో సల్మాన్ అలీ అగాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేల్లో మాత్రం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ కొనసాగించింది.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీపాకిస్తాన్: హారీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఖుష్దిల్ షా, జహందాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్చదవండి: WPL 2025: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan), మాజీ సారథి బాబర్ ఆజం(Babar Azam)లకు ఈ సందర్భంగా షాకిచ్చింది. టీ20 జట్టు నుంచి వీరిద్దరిని తప్పించిన యాజమాన్యం వన్డేల్లో మాత్రం చోటిచ్చింది.పాయింట్ల పట్టికలో అట్టడుగునఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రిజ్వాన్ బృందం.. గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. అనంతరం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో మరోసారి పరాజయాన్ని చవిచూసింది.అనంతరం ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా.. వర్షం అడ్డుపడింది. రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వరణుడి కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఒక్క విజయం కూడా లేకుండానే పాకిస్తాన్ టోర్నీని ముగించింది. పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైంది.ఈ టోర్నీలో కెప్టెన్ రిజ్వాన్‌తో పాటు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై మాజీ క్రికెటర్లు వసీం అక్రం, షోయబ్ అక్తర్ తదితరులు విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంద.న్యూజిలాండ్ పర్యటనకుకాగా చాంపియన్స్ ట్రోఫీలో చేదు అనుభవం తర్వాత పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మార్చి 16- ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్న పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు జట్లను పీసీబీ మంగళవారం ప్రకటించింది. వన్డే సారథిగా రిజ్వాన్‌ను కొనసాగించడంతో పాటు ఆ జట్టులో బాబర్‌కు కూడా సెలక్టర్లు చోటిచ్చారు.అయితే, టీ20లకు మాత్రం పీసీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకువచ్చింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సల్మాన్ ఆఘాను పాక్ టీ20 జట్టు సారథిగా నియమించింది. ఈ క్రమంలో రిజ్వాన్, బాబర్‌లపై వేటు వేసింది. ఆకిబ్ కొనసాగింపుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ ఆకిబ్ జావెద్‌పై కూడా వేటు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా కివీస్ టూర్‌కు మాత్రం పాకిస్తాన్ అతడినే కొనసాగించింది.కొత్తగా మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించిన పీసీబీ.. నవీద్ అక్రం చీమాను టీమ్ మేనేజర్‌గా.. అజర్ మహమూద్‌ను అసిస్టెంట్ కోచ్‌గా సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్‌కు గాయాల వల్ల ఓపెనర్లు ఫఖర్ జమాన్, సయీమ్ ఆయుబ్ దూరం కాగా ఆకిఫ్ జావేద్, మహ్మద్ అలీలకు వన్డే జట్టులో స్థానం దక్కింది.కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో ఐదు టీ20లు.. మార్చి 29, ఏప్రిల్ 2, 5 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.న్యూజిలాండ్‌తో టీ20లకు పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, షాహీన్ షా అఫ్రిది, సూఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!