రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు: అచ్చెన్నాయుడు | revanth reddy will have to face consequences if he committed mistake, says ap minister | Sakshi
Sakshi News home page

రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు: అచ్చెన్నాయుడు

Jun 10 2015 12:50 PM | Updated on Jul 12 2019 4:17 PM

రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు: అచ్చెన్నాయుడు - Sakshi

రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు: అచ్చెన్నాయుడు

రేవంత్ రెడ్డి తప్పు చేస్తే అనుభవిస్తారని, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

రేవంత్ రెడ్డిని క్రమంగా దూరం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్యూ పూర్తిగా వేరని, దాంతో తమకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి తప్పు చేస్తే అనుభవిస్తారని, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు. ఈ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. అయినా.. ఫోన్లలో ఏవో సొంత విషయాలు మాట్లాడుతారని, వాటిని ట్యాప్ చేయడం ధర్మమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

విలేకర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అచ్చంనాయుడుతో పాటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement