ఇంజినీరింగ్ విభాగంలోని ఇద్దరు ఏఈలను సస్పండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఓడీఎఫ్ సాధించేందుకు బహిరంగ మల విసర్జన జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిలో అత్యాధునిక పిటుజడ్ వంటి కెమెరాలు అమర్చడం, క్రమం తప్పకుండా మైకు ద్వారా ప్రచారం నిర్వహించడం, కరపత్రాలు పంచడం వంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా నగరపాలక సంస్థ విడుదల చేసింది. ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15వేలు కేటాయించింది. ఈ నేపథ్యంలో సదరు ఏఈలు మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. అయితే నగరపాలక సంస్థలో పెత్తనం చెలాయిస్తున్న తెలుగు తమ్ముళ్లు వారిపై ఈగ వాలకుండా కాపాడేందుకు అడ్డుపడుతున్నట్లు సమాచారం. దీనివల్లే జాప్యం జరుగుతోంది. ఇటీవలే సాక్షి దిన పత్రికలో మరుగుదొడ్లలో అవినీతి కంపు అనే కథనం ప్రచురితం కావడంతో లుకలుకలపై హడావుడి ప్రారంభం కావడం గమనార్హం.