11.70 కోట్ల కి.మీ. దూరంలో ‘మంగళ్‌యాన్’! | Mars Spacecraft 117 million kms Away from Earth | Sakshi
Sakshi News home page

11.70 కోట్ల కి.మీ. దూరంలో ‘మంగళ్‌యాన్’!

Jun 25 2014 2:17 AM | Updated on Sep 2 2017 9:20 AM

అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గతేడాది నవంబరులో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహం భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది.

బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గతేడాది నవంబరులో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహం భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. సెకనుకు 23 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్ మరో 92 రోజుల్లో 2.40 కోట్ల కి.మీ. ప్రయాణించి మార్స్ కక్ష్యను చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. మామ్ నుంచి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్లకు సంకేతాలు అందేందుకు 6 నిమిషాల 30 సెకన్లు పడుతోంది. ఉపగ్రహం మార్స్ వైపుగా సరైన మార్గంలోనే వెళ్లేందుకుగాను జూన్ 11న రెండో మార్గ సవరణ ప్రక్రియను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement