ప్రేమ పెళ్లి.. భార్యను దూరం చేశారని..

పాతబస్తీలో మరో ప్రేమపెళ్లి కథ విషాదానికి దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top