తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల | TS EAMCET Results 2017 Released | Sakshi
Sakshi News home page

May 22 2017 12:35 PM | Updated on Mar 21 2024 8:11 PM

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో గోరంట్ల జయంత్‌ 156 మార్కులతో మొదటిర్యాంకు సాధించగా.. రాంగోపాల్‌(156 మార్కులు) ద్వితీయ ర్యాంకు, సాయియశస్వీ భరద్వాజ్‌ (155 మార్కులు) తృతీయ ర్యాంకు, దొట్టి ప్రసాద్‌(155) నాలుగో ర్యాంకు, మోహన్‌ అభ్యాస్‌(155) ఐదో ర్యాంకు సాధించారు. ఈ సారి ఫలితాల్లో టాప్‌టెన్‌లో బాలుర హవా కొనసాగింది. కాగా, అగ్రికల్చర్‌, ఫార్మీసీ విభాగంలో 86.49 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఓఎమ్‌ఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 12న నిర్వహించిన ఈ పరీక్షలో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,39,100 మంది... అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,601 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement