ప్రశాంత ఎన్నికలే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Published Fri, Mar 29 2024 2:05 AM

పోలాకిలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న 
కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌  - Sakshi

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

జలుమూరు/పోలాకి: హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. గురువారం జలుమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఎన్నికల్లో తేడాలొస్తే సంబంధిత అధికారులే బాధ్య త వహించాల్సి ఉంటుందన్నారు. ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలు వద్ద పట్టిష్ట బందో బస్తు ఏర్పాటు చేయడంతోపాటు ప్రజలు నిర్భంయంగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చల్లవానిపేటలో తనిఖీ బృందాల పని తీరును పరిశీలించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈయనతోపాటు తహసీల్దార్‌ సీహెచ్‌ నాగమ్మ,డీ.టీ శ్రీనివాసరావు,ఎంపీడీఓ దామోదరరావు,ఎఓ కె.సురేష్‌ కుమార్‌ సిబ్బంది ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పోలాకి మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ పరిశీలించారు. మౌలిక వసతులపై సెక్టార్‌ అధికారులతో సమీక్షించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఎస్‌ఐ సత్యనారాయణకు సూచించా రు. కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement