నేడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు | Sakshi
Sakshi News home page

నేడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు

Published Sat, Nov 11 2023 1:18 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆజాద్‌ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి విద్యావంతులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మైనార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

దీపావళికి

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

గుంతకల్లు: దీపావళి పండగ సందర్భంగా శనివారం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా బీదర్‌–యశ్వంత్‌పూర్‌ మధ్య స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్‌ జంక్షన్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు (06506) బయలుదేరి 12వ తేదీ తెల్లవారుజూమున 4 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (06507) 13న రాత్రి 11.15 గంటలకు యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌ నుంచి బయలుదేరి 14న మధ్యాహ్నం 12.15 గంటలకు బీదర్‌ జంక్షన్‌ చేరుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్‌ జంక్షన్‌ నుంచి రైలు (06508) బయల్దేరి యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌కు 15వ తేదీ తెల్లవారుజూమున 4 గంటలకు చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement