చంద్రబాబుది హత్యారాజకీయాల చరిత్ర | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది హత్యారాజకీయాల చరిత్ర

Published Sat, May 4 2024 3:55 AM

చంద్రబాబుది హత్యారాజకీయాల చరిత్ర

వరికుంటపాడు: చంద్రబాబుది హత్యా రాజకీయాలు చేసే చరిత్ర అని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో విశాఖపట్నంలో, ఇటీవల విజయవాడలో హత్యాయత్నాలు, గతంలో చేసిన హత్యలు చూస్తే అర్థమవుతుందన్నారు. శుక్రవారం మండలంలోని తోటల చెరువుపల్లి, ధర్మవరం, నార్తు కొండాయపాళెం, కృష్ణంరాజుపల్లె, విరువూరు, గొల్లపల్లె, యర్రంరెడ్డిపల్లె, ఇస్కపల్లె, ఎన్‌బీ కాలనీల్లో విజయ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళలతో రాష్ట్రం, కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రతి పథకంలో వారిని భాగస్వామ్యం చేస్తూ సముచిత స్థానం కల్పించారన్నారు. కరోనా సమయంలో ఆయనే సీఎంగా లేకపోయుంటే ఎంతో మంది ప్రాణాలు గాలిలో పోయేవన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే జగనన్నకే సాధ్యమన్నారు. చంద్రబాబు తన పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగు తమ్ముళ్లకు, వారి బంధువులకు లబ్ధి చేకూరేలా చేశారన్నారు. జగనన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు మేలు చేకూర్చారన్నారు. ఆయన మేలును మరువకూడదని ఓటు ద్వారా రుణం తీర్చు కోవాలన్నారు. ఎన్నికలైన మరుసటి రోజే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెరికా, ఎంపీ అభ్యర్థి సౌతాఫ్రికా వెళ్లిపోతారన్నారు. తాను నియోజకవర్గ ప్రజలను కని పెట్టుకుని ఉన్నానని ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాష్ట్రానికి జగనన్న మేనిఫెఫ్టో రూపొందిస్తే, జిల్లా అభివృద్ధికి ఎంపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి మేనిఫెఫ్టో రూపొందించారన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేణుంబాక విజయసాయిరెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనను ఫ్యాను గుర్తుపై ఓటువేసి అత్యఽధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ అలిఅహ్మద్‌, మండల కన్వీనర్‌ మందలపు తిరుపతినాయుడు, సొసైటీ అధ్యక్షుడు జి.రామాంజనేయులు, జేసీఎస్‌ కన్వీనర్‌ బి.వెంకటేశ్వర్లు, నాయకులు మాగంటి సిద్ధయ్య, దాసరి యర్రాఓబయ్య, పి.లక్ష్మమ్మ, వరలక్ష్మయ్య, ఎం.శ్రీను, శ్రీధర్‌, జె.వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు, బి.రాజేంద్ర, ఆర్‌.మధుసూదన్‌రావు, జిలానీబాషా, నరసారెడ్డి, చెన్నారాయుడు, బి.మురళీ,ఎన్‌.రంగయ్య, బి.కొండమ్మ, వై.సరోజనమ్మ పాల్గొన్నారు.

సంక్షేమ సారథిని తిరిగి సీఎం చేసుకుందాం

ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement