సెల్‌ఫోన్స్‌ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్స్‌ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ

Published Tue, May 21 2024 3:32 PM

Telangana Stood second Rank In country stolen, lost mobile with CEIR portal

సాక్షి, హైదరాబాద్‌: చోరికి గురైన లేదా పొరపాటున పోగొట్టున్న సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌, లోకల్‌ ట్రాకింగ్‌ ద్వారా ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఇప్పటి వరకు పోలీసులు రోజుల్లో 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు.35,945 సెల్‌ఫోన్స్‌ రివకరీలతో కర్నాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా..  7387 సెల్‌ఫోన్స్‌ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఫోన్ దొంగతనం లేదా కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో  నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement