రోహిత్‌ ఒక అద్భుతం.. అతడంటే నాకు ఎంతో ఇష్టం: విండీస్‌ దిగ్గజం | Viv Richards praises Rohit sharma highly skilled individual | Sakshi
Sakshi News home page

రోహిత్‌ ఒక అద్భుతం.. అతడంటే నాకు ఎంతో ఇష్టం: విండీస్‌ దిగ్గజం

Aug 25 2023 10:38 AM | Updated on Aug 25 2023 11:44 AM

Viv Richards praises Rohit sharma highly skilled individual - Sakshi

ఆసియాకప్‌-2023కు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్న భారత్‌.. మరోసారి ఆసియా కింగ్‌గా నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో  ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రెయినింగ్‌ క్యాంపులో భారత జట్టు బీజీబీజీగా గడుపుతోంది.

ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ టెస్టును కూడా క్లియర్‌ చేశారు. మరికొంత మంది ఆటగాళ్లు కూడా యో- యో టెస్టుకు హాజరకానున్నారు. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ నేపాల్‌ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పై వెస్టిండీస్‌ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్‌ శర్మకు అద్భుతమైన స్కిల్స్‌ ఉన్నాయని రిచర్డ్స్ కొనియాడాడు.

రోహిత్‌ ఒక అద్భుతం.. 
"ప్రపంచ అత్యత్తుమ క్రికెటర్లలో రోహిత్‌ శర్మ ఒకడు. రోహిత్‌ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ అంటే నాకు ఎంతో ఇష్ట​ం. రోహిత్‌లో కొంచెం భయం, ఒత్తిడి వంటవి కనిపించవు. అటువంటి ఆటగాళ్లను నేను ఎక్కువగా ఇష్టపడతాను" అని జర్నలిస్ట్‌ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్స్ పేర్కొన్నాడు.
చదవండిAsian Games 2023: ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.. ఏకంగా పాకిస్తాన్‌ కెప్టెన్‌గా! ఎవరీ అక్రమ్‌?

Advertisement
 
Advertisement
Advertisement