వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం | Telangana Swimmer Vritti Agarwal won gold in Aquatics Championship | Sakshi
Sakshi News home page

వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం

Sep 12 2024 3:49 AM | Updated on Sep 12 2024 3:50 AM

Telangana Swimmer Vritti Agarwal won gold in Aquatics Championship

మంగళూరు: జాతీయ సీనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వృత్తి అగర్వాల్‌ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్‌ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో విజేతగా నిలిచింది. 

వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement