సిరీస్‌పై గురి | Second T20 between India and Zimbabwe women today | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై గురి

Oct 18 2026 2:43 AM | Updated on Oct 18 2026 2:43 AM

Second T20 between India and Zimbabwe women today

నేడు భారత్, జింబాబ్వే మహిళల రెండో టి20

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

రాయ్‌పూర్‌: జింబాబ్వేతో తొలి టి20లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత మహిళల క్రికెట్‌ జట్టు... నేడు జరగనున్న రెండో టి20లో కలసికట్టుగా కదం తొక్కాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్‌ జరగనుండగా... ఇందులో గెలిచి సిరీస్‌ చేజిక్కించుకోవాలని స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా యోచిస్తోంది. గత మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యఛేదనలో భారత టాపార్డర్‌ విఫలమైంది. కె

ప్టెన్‌ స్మృతి మంధాన, మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, షఫాలీ వర్మ, అనుష్క శర్మ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఒక దశలో టీమిండియా 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నిక్కీ ప్రసాద్‌తో కలిసి దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించింది. గత మ్యాచ్‌ ద్వారానే అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నిక్కీ ప్రసాద్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లోనూ ఆమె నుంచి జట్టు అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. 

ఒక పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన స్మృతి మంధాన... రెండో టి20లో అయినా సాధికారిక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీచరణి అదరగొడుతుండగా... క్రాంతి గౌడ్, నందని, అరుంధతి, దీప్తి శర్మ, షఫాలీ వర్మ రూపంలో మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement