ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం​.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ Salt, Bairstow guide England to comfortable 8-wicket win over West Indies. Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం​.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published Thu, Jun 20 2024 9:32 AM | Last Updated on Thu, Jun 20 2024 10:11 AM

 Salt, Bairstow guide England to comfortable 8-wicket win over West Indies

టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8 దశలో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. సెయింట్‌ లూసియా వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్‌ జట్టు ఊదిపడేసింది.

ఇంగ్లండ్‌ 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు జానీ బెయిర్‌ స్టో(48 నాటౌట్‌), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(25) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌, ఛేజ్‌ తలా వికెట్‌ సాధించారు.కాగా అంతకముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

విండీస్‌ బ్యాటర్లలో చార్లెస్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పూరన్‌(36), పావెల్‌(36), రుథర్‌ఫార్డ్‌(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అర్చర్‌, కుర్రాన్‌, మొయిన్‌ అలీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement