చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా | ODI World Cup 2023, IND Vs NZ: Rohit Sharma Becomes First Indian To Smash 50 ODI Sixes In A Calendar Year - Sakshi
Sakshi News home page

WC 2023 IND vs NZ: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా

Published Mon, Oct 23 2023 3:19 PM

Rohit Sharma Makes World Cup History,Becomes First Indian Ever To Achieve this Feat - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన అద్బుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ​మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్‌మ్యాన్‌ 46 పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.4 ఫోర్లు, 4 సిక్స్‌లతో కివీస్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 4 సిక్స్‌లు కొట్టిన రోహిత్‌ శర్మ.. ఓ అరుదైన ఘనతను తన పేరిటి లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో  50 లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన మొదటి ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 53 సిక్స్‌లు బాదాడు.

ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ మూడో స్ధానంలో నిలిచాడు. ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసిన జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌(58 సిక్స్‌లు) తొలి స్ధానంలో ఉండగా.. వెస్టిండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌(56 సిక్స్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. 
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్‌ క్లాస్‌: రోహిత్‌ శర్మ

Advertisement
Advertisement