ఉత్కంఠ‌పోరు.. ఆఖ‌రి బంతికి గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్‌ | MLC 2025: Phillips does it for Washington Freedom in last-ball thriller | Sakshi
Sakshi News home page

MLC 2025: ఉత్కంఠ‌పోరు.. ఆఖ‌రి బంతికి గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్‌

Jun 27 2025 10:57 AM | Updated on Jun 27 2025 11:51 AM

MLC 2025: Phillips does it for Washington Freedom in last-ball thriller

మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ త‌మ జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది.  గురువారం డల్లాస్ వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వి​కెట్ల తేడాతో వాషింగ్ట‌న్ ఘ‌న విజ‌యం సాధించింది. నైట్‌రైడ‌ర్స్ నిర్ధేశించిన 214 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని వాషింగ్ట‌న్ ప్రీడ‌మ్ ఆఖ‌రి బంతికి చేధించింది.

చివ‌రి బంతికి ఒక్క‌ప‌రుగు కావాల్సిన నేప‌థ్యంలో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్‌ను హోల్డ‌ర్ జార‌విడిచ‌డంతో నైట్‌రైడ‌ర్స్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. వాషింగ్ట‌న్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ ఓవెన్‌(43) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్‌(42), గ్లెన్ ఫిలిప్స్‌( 33 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్ల‌లో త‌న్వీర్ సంగా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హోల్డ‌ర్‌, అలీ ఖాన్‌, షాడ్లీ వాన్ షాల్క్విక్ త‌లా వికెట్ సాధించారు.

ఫ్లెచ‌ర్ సెంచ‌రీ వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ అండ్రీ ఫ్లెచర్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు.

అతడితో పాటు ఉన్ముక్త్‌ చంద్‌(41), రస్సెల్‌(30) రాణించారు. వాషింగ్టన్‌ బౌలర్లలో హాలండ్ రెండు, జార్‌ ఎడ్వర్డ్స్‌ ఒక వికెట్ పడగొట్టారు. అయితే నైట్‌రైడర్స్ ఓటమి పాలవ్వడంతో ఫ్లెచర్ సెంచరీ వృథా అయిపోయింది. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన లాస్ ఏంజిల్స్ కేవ‌లం ఒక మ్యాచ్‌లో మాత్ర‌మే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్దానంలో కొన‌సాగుతోంది.
చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌.. ఓటమి తప్పదా?

Advertisement
 
Advertisement
Advertisement