ఢిల్లీతో ​మ్యాచ్‌.. కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే | IPL 2024 Dc vs KKR: Delhi capitals won the toss elected to bat First | Sakshi
Sakshi News home page

Dc vs KKR: ఢిల్లీతో ​మ్యాచ్‌.. కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే

Apr 29 2024 7:17 PM | Updated on Apr 29 2024 7:17 PM

IPL 2024 Dc vs KKR: Delhi capitals won the toss elected to bat First

ఐపీఎల్‌-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్‌ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్‌ స్టార్క్‌, వైభవ్‌ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement