‘కామన్‌వెల్త్‌’ పవర్‌ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు | Gold medals for Sadia in Commonwealth Powerlifting | Sakshi
Sakshi News home page

‘కామన్‌వెల్త్‌’ పవర్‌ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు

Oct 12 2024 3:19 AM | Updated on Oct 12 2024 3:19 AM

Gold medals for Sadia in Commonwealth Powerlifting

మూడు విభాగాలతోపాటు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సొంతం  

సాక్షి, అమరావతి: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఎక్విప్డ్‌ చాంపియన్‌ షిప్‌ జూనియర్‌ విభాగంలో సాదియా అల్మాస్‌ గురువారం బంగారు పతకాలు సాధించారు. 

స్వాట్, బెంచ్‌ ప్రెస్, డెట్‌ లిఫ్ట్‌ మూడు విభాగాల్లోను బంగారు పతకాలతోపాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్‌ విభాగంలో కూడా మరో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అమెకు ఏపీ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement