Sakshi News home page

అంకిత రైనా శుభారంభం  

Published Wed, Jan 10 2024 4:20 AM

Ankita Raina is off to a good start - Sakshi

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ లో భారత స్టార్‌ అంకిత రైనా శుభారంభం చేసింది. మెల్‌బోర్న్‌లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 221వ ర్యాంకర్‌ అంకిత 6–4, 5–7, 7–6 (10/7)తో ప్రపంచ 158వ ర్యాంకర్‌ జెస్సికా బుజస్‌ మనెరో (స్పెయిన్‌)పై గెలిచింది.

2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ తమ సర్విస్‌లను ఎనిమిదిసార్లు కోల్పోయారు. నిర్ణాయక మూడో సెట్‌ టైబ్రేక్‌లో అంకిత పైచేయి సాధించి విజేతగా నిలిచింది. రెండో రౌండ్‌లో ప్రపంచ 132వ ర్యాంకర్‌ సారా బెజ్‌లెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో అంకిత తలపడుతుంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement