అభయ్‌ సింగ్‌ డబుల్‌ ధమాకా | Abhay Singh Double Dhamaka | Sakshi
Sakshi News home page

అభయ్‌ సింగ్‌ డబుల్‌ ధమాకా

Jul 8 2024 4:12 AM | Updated on Jul 8 2024 4:12 AM

Abhay Singh Double Dhamaka

ఆసియా డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ అభయ్‌సింగ్‌ పురుషుల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌–వెలవన్‌ 11–4, 11–5తో ఒంగ్‌ సై హుంగ్‌–సిఫిక్‌  (మలేసియా)లపై నెగ్గారు. ‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో అభయ్‌–జోష్నా చినప్ప (భారత్‌) 11–8, 10–11, 11–5తో టాంగ్‌ వింగ్‌–టాంగ్‌ హాంగ్‌ (హాంకాంగ్‌)లపై గెలిచారు.  

Advertisement
 
Advertisement
Advertisement