YV Subbareddy Counter To Amit Shah Comments Speech In Visakhapatnam - Sakshi
Sakshi News home page

టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

Jun 12 2023 1:24 PM | Updated on Jun 12 2023 3:14 PM

Yv Subbareddy Counter To Amit Shah Comments - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బీజేపీ.. టీడీపీ ట్రాప్‌లో పడిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాలో మాట్లాడుతూ, ‘‘టీడీపీ నేతల మాటలనే అమిత్‌షా చెప్పారు. అమిత్‌షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలే. వారంతా పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే’’ అని సుబ్బారెడ్డి మండిపడ్డారు.

‘‘2014-19 వరకు టీడీపీతో కలిసున్న బీజేపీ అప్పుడు ఏం చేసింది?. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం లేదా?. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
చదవండి: 14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు?.. నేను నమ్మింది దేవుడ్ని, ప్రజల్ని: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement